పదవి విరమణ పొందిన మైనార్టీ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ ను సన్మానించిన ముస్లీం వెల్ఫేర్ ఆర్గనైజేషన్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరిఖని త్రినేత్రం న్యూస్
తెలంగాణ రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ డిపార్టెమెంట్ జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తూ పదవీ విరమణ పొందిన గోదావరిఖని సప్తగిరి కాలనీకి చెందిన మొహమ్మద్ ఖాసీంను శనివారం ముస్లీం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తా గౌసేపాక్ షీల్లా షరీఫ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మొహమ్మద్ ఖాసీంను పూలమాలలు శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ అధ్యక్షులు షేక్ హాజీ అలీ మాట్లాడుతూ విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించి పలువురి మన్నాళ్లు పొందారన్నారు. భావి జీవితం నూరేళ్లు అష్ట ఐశ్వర్యములు, ఆయురారోగ్యాలతో ఆనందంగా సాగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో ముస్లీం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీర్ జాకీర్ అలీ, జనరల్ సెక్రెటరీ షేక్ బాజీ, ఉపాధ్యక్షులు జానియాడ్స్, జాయింట్ సెక్రెటరీ హస్సన్ చిస్తి, జంజం మసీదు అధ్యక్షులు, మహ్మద్ ఖాసీం, లీగల్ అడ్వైజర్ షాన్వాజ్, మున్వర్, ల్యాకత్ అలీ బేగ్, మీర్ ఫయాజ్, నయీమ్, షఫీ, బురాన్, ఫయాజ్ అలీ, తాజ్, జిషాన్, చోటు,నిషాంత్, ఖాదర్ అలీ, ఫుర్కాన్, టిప్పు సుల్తాన్, అన్వర్, గౌస్, షఫి కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App