భోగి మరియు సంక్రాంతి పండుగను చేయుటకు ముహూర్తాలు – గుడిమెట్ల చిట్టి బాబు పంతులు
Trinethram News : తేది 14 :1:2024 ఆదివారం భోగి పండుగ (శనివారం రాత్రి 2:30నుంచి4:30)తెల్లవారితే ఆదివారం అనగా భోగిమంట వేయుటకు..శుభయుక్త ముగా యున్నది.
ఆదివారం సాయంత్రం 5:30నుంచి7:30 నిమషము లలోగా పిల్లలకు బోగీ పళ్ళు (కొండరేగుపళ్ళు) వేయుటకు శుభయుక్త గాయున్నది.
తేది 15:1:2024 స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సర పౌష్య శుద్ధ చవితి సోమవారం ఉదయం 8:25నిమషములుకు సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశి లో ప్రవేశించును, ఆ పుణ్య సమయములో సముద్ర నదీ తటాక స్నానములుకు,మంత్ర జప దానములుకు పితృ దేవతలకు ప్రీతిగా ముద్ద…పిడచ…మండపాలు వేయుటకు…ముత్తైదువులకు ఫల సహిత తాంబూలములు ఇచ్చుటకు పసుపు కుంకుమ (నైవేద్యం ) ధారపోయుటకు ఇచ్చుటకు మరియు తెల్లవారుజామున 3గంటల నుంచి తెల్లవారితే సోమవారం అనగా పితృ దేవతలకు ప్రీతిగా స్వయం పాకములు, పొత్తర్లు ఇచ్చుటకు సరియగు సమయం. (ముఖ్యముగా కూరలు తక్కువగా పెట్టవలెను ఎందుకు అనగా కూరలు మరునాడు కి కుళ్ళి పోవుచున్నవి …పప్పులు దినుసులు బియ్యం ధనం రూపేణ ఇచ్చినచో మీకు అందరికీ ఉపయోగకరం అని నాభావన ఆపై మీ ఇష్టం)
తేది 16:1:2024 మంగళవారం కనుమ పశువుల పండుగ ఆ రోజు మన పాడి పశువులకు గోవులకు స్నానం చేయించి పసుపు కుంకుమల తో అలంకరణ చేసి పూజచేసి అరటి పండ్లు బెల్లం నైవేద్యముగా పెట్టవలెను.
ఈ మూడు రోజుల పండుగను ఎంతో సంప్రదాయ బద్ధముగా మన మహర్షులు, పెద్దలు చెప్పినవిధముగా ఆచరించి తరించుదాం…. జై శ్రీ రాం జై శ్రీ రాం జై శ్రీ రాం..