గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు మాదిగ లాయర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తలపెట్టిన ఫిబ్రవరి 7న వేయి గొంతులు లక్ష డప్పులు మాదిగల మండే గుండెచప్పుడు మహా ర్యాలీకి హైదరాబాద్ మద్దతుగా స్థానిక గోదావరిఖని కోర్టు నుండి డప్పులతో ర్యాలీగా బయలుదేరి ప్రెస్ క్లబ్ వరకు ర్యాలీ ముగించుకొని అనంతరం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు జూపాక వెంకటి, మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు ఎస్సీలలో ఉండే 59 ఉపకులాలకు అందాలని మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాడు ఇట్టి ఉద్యమానికి భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి విప్లవ పార్టీలు కవులు కళాకారులు మేధావులు కార్మిక సంఘాలు సబ్బండ కులాలు మద్దతు తెలిపాయి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఏడుగురితో కూడిన సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది కావున రాష్ట్రంలకు అధికారం ఉన్నది అని తీర్పు ఆగస్టు 1న 2024 వచ్చింది దీని ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేసి మాకు న్యాయం చేయాలని అన్నారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు లాయర్ ఆసంపల్లి రవి, ఇరుగురాళ్ల సంతోష్, బల్మూరి అమరేందర్రావు, పులిపాక రాజ్ కుమార్, సంజయ్ కుమార్, ఎమ్మార్పీఎస్ ఎంఎస్ఎఫ్ కన్వీనర్ కన్నూరి ధర్మేందర్ మాదిగ, పల్లె బాబు మాదిగ, కాసిపాక రాజయ్య, మడిపల్లి దశరథం, జీవన్, వడ్లూరి శ్రీనివాస్, కోటిపల్లి దుర్గాప్రసాద్, దాసరి ఎల్లయ్య, పల్లె రాజయ్య, శైలజ, మేడం అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App