TRINETHRAM NEWS

ఎమ్మెల్సీ కవిత సోషల్‌మీడియా అకౌంట్ హ్యాక్

తన సోషల్‌మీడియా ఖాతా హ్యాక్ అయినట్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

‘నా సోషల్ మీడియా ఖాతాను అనధికారంగా ఎవరో యాక్సెస్ చేశారు.

ఈ సమయంలో అందులో వచ్చిన పోస్టులకు నాకు ఎలాంటి సంబంధంలేదు.

భద్రతా చర్యలు పటిష్టం చేశాం. మా ఆఫీస్ టీమ్ పనిచేస్తున్నందున అందరూ అర్థంచేసుకోవాలి.

ఈ విషయమై సైబర్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేస్తామ’ని ట్వీట్ చేశారు.