Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 12
కృష్ణ నదిపై ఉన్న ప్రాజెక్టు లను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించ బోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. చేసిన తప్పును సరిదిద్దు కోవాలని రాష్ట్ర ప్రభుత్వా నికి సూచించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.
అసెంబ్లీలో ఆవరణలో సోమవారం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ నీటి హక్కులను వదులుకునే మనిషి కాదన్న సంగతి ప్రజలందరికీ తెలున్నారు. జలాల సాధన కోసమే తెలంగాణ ఉద్యమం చేశామని, కాబట్టి నీటి హక్కుల విషయంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ రాజీ పడబోదని తేల్చి చెప్పారు.
కృష్ణానదిపై ఉన్న ప్రాజె క్టులను కేంద్రానికి అప్పగిం చడానికి జరిగిన సమావే శాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రాజెక్టులను ధారాదత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని, దాన్ని కప్పి పుచ్చుకోవడానికి తమపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.
కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పచెప్పే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ శాసన సభ, మండలిలో తీర్మానం తీసుకరావాలని, తమ పాపాలను ప్రక్షాళన చేసు కోవాలని చెప్పారు. తెలం గాణ హక్కుల విష యంలో బీఆర్ఎస్ సంపూర్ణ మద్దత్తు ఉంటుందని స్పష్టం చేశారు…