TRINETHRAM NEWS

Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సోమవారం కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీలో రౌస్‌ అవెన్యూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బెయిల్ పిటీషన్ ను నిరాకరించింది. చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో కవిత బెయిల్‌ కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు.

కవిత తరపున అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టును కోరిన ఈడీ.. బెయిల్‌ ఇస్తే సాక్షాలను ప్రభావితం చేస్తారంటూ వాదనలు వినిపించింది.అప్రూవర్‌ను కవిత బెదిరించారంటూ జడ్జికి కీలక ఆధారాలు సమర్పించింది. ఈ క్రమంలో కోర్టు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ ను తోసిపుచ్చింది. కాగా.. అరెస్టు అనంతరం కవిత మార్చి 26 నుంచి తిహార్‌ జైల్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇదిలాఉంటే.. రేపటితో కవిత జ్యూడిషియల్ రిమాండ్ ముగియనుంది.