
(పి డి ఎఫ్ స్థానిక ఎన్నికల నుండి చట్టసభల వరకు పోటీ చేయాలి : పౌర సంక్షేమ సంఘం) 29.3.2025
శాసనమండలి సభ్యునిగా ఇళ్ల వేంకటేశ్వరరావు తన పదవీ కాలాన్ని ఆనాటి పుచ్చలపల్లి సుందరయ్య సి వి కె రావు తరహాలో నీతికి నిజాయితీకి నిలబడి తాను నమ్ముకున్న భగత్ సింగ్ ఆశయాల వారధిగా అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తూ చేసిన నిరంతర నిస్వార్థ ప్రజాసేవ అత్యంత ఆదర్శ ప్రాయమని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. నగరంలో యు టి ఎఫ్ హాలులో జరిగిన కార్యక్రమంలో పౌర కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ స్థానిక సంస్థల నుండి అసెంబ్లీ పార్లమెంట్ చట్టసభల వరకు పి డీ ఎఫ్ పోటీ చేయాలని పాలక ప్రతిపక్షాలకు ప్రత్యామ్నాయ వారధిగా నిలవాలని కోరారు.
స్వాతంత్ర్యం సిద్ధించిన రోజుల్లో పుచ్చల పల్లి సుందరయ్య ప్రజాస్వామ్య పునాదులు వేయగా తెదేపా ఏర్పాటుతో ఎన్ టి ఆర్ హయాం నందు నూతన తరం ముందుకు వచ్చిందని ప్రస్తుత వెగటు రాజకీయాల్లో ప్రజాదరణ కోరే ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజల్లోకి పి డి ఎఫ్ రావాలన్నారు. సుందరయ్య చిత్రపటాన్ని అందించి ఎర్ర కండువాతో ఐ వి సేవలను కాకినాడ నగర ప్రజల తరపున కొనియాడుతూ అభినందనలు తెలియజేశారు. అడగ వలసిన చోట అడగాలని నిలదీయాల్సిన చోట నిలదీయాలని ప్రశ్నించాల్సిన ప్రతి సందర్భంలోనూ ముందడుగు వేస్తేనే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుందని ఇళ్ల వేంకటేశ్వర రావు తన అనుభవాల సారాంశాన్ని నేటి సమాజానికి అందించడం హర్ష దాయకమన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
