TRINETHRAM NEWS

కాతేరు గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల

Trinethram News : ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు ఘన విజయం ఖాయమని, రాజశేఖర్ శాసన మండలి లో అడుగు పెడుతున్నారని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కాతేరు గ్రామంలో గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ఎమ్మెల్యే గోరంట్ల, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి రామ్ కిరణ్, పరిశీలకులు డొక్కా నాగబాబు, ఎం.తేజవతి హాజరయ్యారు.

ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెడుతుందని, అనేక నూతన చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని, శాసనమండలిలో వైకాపాకు బలం ఉంది కాబట్టి బిల్లులను అడ్డుకుంటారని, ఇలాంటి సమయంలో విద్యావేత్త పట్టభద్రుల సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తి మన పేరాబత్తుల రాజశేఖర్ లాంటి వాళ్లను శాసన మండలికి పంపించేందుకు మనందరం కృషి చేయాలని కోరారు.

ఈనెల 27వ తారీకున జరిగే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బిజెపి బలపరిచిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం గ్రామంలో గల సచివాలయం, స్కూల్స్ నందు ఉద్యోగస్తులను కలిసి పేరాబత్తుల విజయానికి అందరూ సహకారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షుడు మత్స్సేటి ప్రసాద్, బిక్కిన సాంబశివరావు, గంగిన నాని, నున్న బాబురావు, మద్దిపాటి రామకృష్ణ, యానాపు యేసు, రాకుర్తి రామచంద్రరావు, సోముల స్వామీజీ, పడాల హాథిరామ్, నాగం శివ, పిల్ల తనుజ, మద్ద మణి, కొల్లి వెంకటరావు, ఎమ్మెస్సార్ శ్రీను, ఆళ్ల విఠల్ మరియు ఎన్.డి.ఏ ఓటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Gorantla