MLA Raj Thakur Goliwada Prasanna Kumar Gangaputra are the District Presidents of NCP Party
గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈ సమావేశంలో గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర మాట్లాడుతూ ” రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కక్ష్యా పూరిత రాజకీయాలు చేస్తున్నారని, రామగుండం కార్పోరేషన్ పరిథిలో సుమారు 250 పైచీలుకు ఫ్లెక్సీ బోర్డులను అకారణంగా తీసివేసి సుమారు 200 మంది ఉపాధికి తీవ్ర నష్టం కలిగించడం జరిగిందని, రామగుండం కార్పోరేషన్ లో సుమారు10 ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపులు ఉండగా, వాటి యజమానులు అప్పులు చేసి, బ్యాంకులలో లోన్లు తీసుకొని అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారని, కానీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అనాలోచిత చర్యల వలన వారి వద్ద పనిచేసే వారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది, కనీసం షాపులకు కిరాయిలు కట్టలేక పోతున్నారు.
బ్యాంకు ఈఎంఐ లు, అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హైవేలపైన ఫ్లేక్సీ బోర్డులను తొలగించినప్పుడు, హైవేలకు వంద మీటర్ల దూరంలో వైన్స్ షాపులు, బార్ షాపులు ఉండాలనే ఆదేశాలను కూడా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాటించాలని, హైవేలపైన ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఉండకూడదు, కానీ రామగుండం కార్పోరేషన్ ఏరియాలో ట్రాఫిక్ సిగ్నల్స్ వలన ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి, వైన్స్, బార్ల వలన నిత్యం ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు.
వాటిని వదిలివేసి ఫ్లెక్సీ బోర్డులను తొలగించి కష్ట జీవుల బతుకులపైన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బుల్డోజర్ తోలుతున్నాడని, రామగుండం కార్పోరేషన్ కు ప్రతి సంవత్సరం సుమారు నలభై లక్షల రూపాయలు ఆదాయం వచ్చే ఫ్లేక్సీ బోర్డులను తొలగించి కార్పోరేషన్ ఆదాయానికి గండి పడుతుందని, ఫ్లెక్సీ షాపు యజమానులు భయభ్రాంతులను గురవుతున్నారని, వారు అప్పులపాలై ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే, దానికి భాద్యత ఎమ్మెల్యే వహిస్తాడా? వారి కుటుంబం రోడ్డున పడితే ఆ భాద్యత ఎమ్మెల్యే తీసుకుంటాడా?
అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మొదటగా హైవేలపైన ఉన్న వైన్స్, బార్లను తొలగించాలని, వంద మీటర్ల దూరంలో ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని, తీసివేసిన ఫ్లెక్సీ బోర్డులను వెంటనే ఏర్పాటు చేపించాలని, ఎన్సీపీ పార్టీ ఫ్లెక్సీ షాపు యజమానులకు అండగా ఉంటుందని ” ఎన్సీపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎన్సీపీ పార్టీ జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజు, గుళ్లపల్లి రాజ్ కుమార్, కోట శ్రీనివాస్, మహిళా నాయకురాల్లు మామిడిపల్లి రాజేశ్వరి, నూనె కనకలక్ష్మీ, అర్కుటి పద్మ, దేశబత్తుల రజిత, గుంటి విజయలక్ష్మీ, బద్రి లక్ష్మీ, మడిపెల్లి దేవమ్మ, ఇరుకుల్ల లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App