TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 28 : శుక్రవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కెపిహెచ్బి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో పార్కులను పరిశీలించారు.ఇదే సందర్భంలో మలేషియన్ టౌన్షిప్ వద్ద 5 ఎకరాలు గల పార్కులో జిహెచ్ఎంసి వారు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 5వ ఫేస్ లోని ట్రయాంగిల్ పార్కులో మౌలిక సదుపాయాలు కల్పించి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని తెలిపారు మరియు 4వ ఫేస్, ఫస్ట్ బస్టాప్ వద్దగల థీమ్ పార్కును మరియు బస్తీ దవాఖాన ముందుగల పెద్ద పార్కును కూడా పరిశీలించి పెండింగ్ పనులు ఏమన్నా ఉంటే పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదే సందర్భంగా గత 10ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని నేడు కనీసం వాకర్స్ పార్కుల్లోకి వాకింగ్ కి వెళ్లాలన్న డబ్బులు వసూలు చేయడం ఎంతో బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఆనాడు ప్రజలకు ఉపయోగపడతాయని సదుద్దేశంతో ఎన్నో పార్కులను, ఇండోర్ షటిల్ కోర్టులను ఆనాటి మంత్రి కేటీఆర్ సహకారంతో నిర్మించుకున్నామని ఇప్పుడు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సాయిబాబా చౌదరి, రాజేష్ రాయ్, సాయి శ్రీనివాస్, అధికారులు.ఈఈ శ్రీనివాస్, డి ఈ శంకర్, ఏ ఈ సాయి ప్రసాద్, హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి.. వెంకటేష్ గౌడ్, యు బి డి అధికారులు డిప్యూటీ డైరెక్టర్ పద్మనాభం, మేనేజర్ విజయ రాణి, సమత, కార్యకర్తలు, నాయకులు, మహిళా నాయకులు, కాలనీవాసులు, అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Madhavaram Krishna Rao