TRINETHRAM NEWS

My support will always be there for the development of the colony: MLA KP.Vivekananda

ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ కు చెందిన వెంకటేశ్వర నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి కాలనీలో చేపట్టవలసిన భూగర్భ డ్రైనేజీ, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులపై వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ అధికారులతో మాట్లాడి కాలనీలో త్వరలోనే భూగర్భ డ్రైనేజీ, వీధి దీపాల ఏర్పాటు పనులను చేపడతామని, గత పదేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో కాలనీలో మరిన్ని అభివృద్ధి పనులను చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు మధుకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మనోహర్, కోశాధికారి జ్ఞానేశ్వర్ గౌడ్, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

My support will always be there for the development of the colony: MLA KP.Vivekananda