జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 01 at 4.03.15 PM

TRINETHRAM NEWS

ప్రేమ, కరుణ, సాటి మనిషికి సాయం… ఇదే సర్వమత సారం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద….

ఐపీసీ హార్మని చర్చ్ మొదటి వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ..

ఈరోజు మున్సిపాలిటీ పరిధి చర్చి గాగిల్లాపూర్ చైతన్య కాలనీలోని ఐపిసి హార్మోని చర్చ్ మొదటి వార్షికోత్సవ వేడుకల కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ ప్రేమ, కరుణ, సాటి మనిషికి సాయం ఇదే సర్వమత సారమన్నారు. అనంతరం నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటుచేసిన కేక్ ను కట్ చేసి క్రైస్తవ సోదరులు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, పాస్టర్ బిఎస్ రావు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, నాగరాజు, జగన్, రంజిత్ రెడ్డి, సారధి, ధార మహేష్, జల్దా లక్ష్మీనాథ్, సతీష్, ఫణి తేజ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page