TRINETHRAM NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ లో జరుగుతున్న శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మరియు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం, జాతరలో ఈరోజు గౌరవ MLA కేపీ.వివేకానంద పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వారి దయతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, BRS పార్టీ సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి, ఆకుల యాదయ్య, దర్శన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, S.రాజిరెడ్డి, మన్నే శేఖర్, మన్నే బాలరాజు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.