
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. దమ్మపేట మండలం చిన్నగొల్లగూడెం గ్రామంలో జోనుబోయిన మల్లయ్య రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాలు కోల్పోయి నడవలేని స్థితిలో ఉన్న విషయాన్ని స్థానిక నాయకులు గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దృష్టికి తీసుకురావడంతో జర్మన్ టెక్నాలజీ తో నడవడానికి అనుకూలంగా ఉండే కృత్రిమ కాలు ఏర్పాటు చేసి ఈ రోజు వారికి స్వయంగా ధరింపజేశారు.
అనంతరం అదే గ్రామంలో గుండె సంబందిత వ్యాధితో మరణించిన తాళ్ల వెంకటస్వామి దశదిన కార్యక్రమంలో పాల్గొని వారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
