TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. దమ్మపేట మండలంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యటించి గండుగులపల్లి సీతారామపురం గ్రామ పంచాయతీలలో ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంజూరైన చెక్కులు అందించారు. రెడ్యాలపాడు గ్రామంలో మాజీ యంపిపి సోయం ప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొంది ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుండగా పరామర్శించి ప్రస్తుత పరిస్థితిని గమనించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అనంతరం ముష్టిబండ గ్రామంలో కుందుల ప్రభాకర్-పావని దంపతుల కుమారుడు ప్రణయ్ పుట్టినరోజు వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. అదే గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన దాంట్ల శ్రీను గారి కుటుంబాన్ని పరామర్శించిన ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం పరంగా సహాయం అందిస్తామని భరోసానిచ్చారు ..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రామశాఖ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jare visited Dammapeta