
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నీ శాలువాతో సత్కరించిన యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాక రమేష్
తెలంగాణ రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సెషన్ సమావేశాలు ముగించుకొని ఇంటికి విచ్చేసిన గౌరవ అశ్వారావుపేట శాసన సభ్యులు జారే ఆదినారాయణ నీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఆనందాన్ని వ్యక్తం చేసిన యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాక రమేష్. ఇటీవలే జరిగిన శాసన సభ సమావేశాలలో నియోజకవర్గ సమస్యలపై, విద్య, వైద్యం మౌలిక వసతుల కల్పనపై వారి గళాన్ని, భాణిని వినిపించుటకు ఎమ్మెల్యే గారు మరొక కోణంలో, వినూత్న రీతిలో పాట రూపంలో వినిపించి సహచర శాసన సభ్యుల మన్ననలు పొందటం విధితమే. అదే విధంగా శాసన సభలో ద్రవ్య వినిమయ బిల్లు గురించి మాట్లాడటం, మరొక ప్రత్యేక విషయం డిమాండ్స్ సందర్భంలో శాసన సభలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడే అవకాశం రావడం గొప్ప విషయం.
కొత్త సభ్యులకు అవకాశం రావడం చాలా అరుదు అలాంటి సందర్భంలో కూడా మన ఎమ్మెల్యే కి మాట్లాడే అవకాశం రావడం హర్శించదగిన విషయమని కాకా రమేష్ తెలిపారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న సంక్షేమ పథకాలపై, విద్యార్తిని, విద్యార్థుల, విద్య, వైద్యం మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేయడం, నియోజకవర్గ అభివృద్ధికి, శాంతి భద్రతలకు కావాల్సిన సదుపాయాలను, నిధులను కల్పించాలని జిల్లా మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేసి, నిధులు కేటాయించాలని కోరగా సానుకూలంగా స్పందించడం విశేషం. అదే విధంగా నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఎమ్మెల్యే కి కృత్ఞతలు తెలియచేయడం జరిగింది.
ఈ సెషన్ శాసన సభ సమావేశాలలో అశ్వారావుపేట శాసన సభ్యులు జారే ఆదినారాయణ నియోజకవర్గ ప్రతినిధిగా శాసన సభలో వారికంటూ ఒక ప్రత్యేకతను పొందుకోవడం నియోజకవర్గ ప్రజలు అందరు సంతోషించదగిన విషయమని కాక రమేష్ ఆనందం వ్యక్తం చేశారు. గతంలో పనిచేసిన శాసన సభ్యులు కంటే ప్రస్తుత ఎమ్మేల్యే ఆదినారాయణ శాసన సభలో ఏడాదిలోనే నాలుగు సార్లు శాసన సభలో నియోజకవర్గ సమస్యలపై, అభివృద్ధికి సంభంధించిన అంశాలపై మాట్లాడటం శుభ పరిణామమని కాక రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ముళ్ళపూడి వెంకటేశ్వరరావు, వాసం శ్రీను, పిఎ నరేష్, కొర్స సాగర్, మడకం రాజేష్, తంగెళ్ళ విశ్వనాథ్, చంద్రశేఖర్,కామేశ్వరరావు, నందిగాం గౌతం తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
