
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. దమ్మపేట మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన మొండివర్రె గ్రామపంచాయతీలో ముమ్మరంగా జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందించే ఐదు లక్షల రూపాయలను పూర్తిగా సద్వినియోగం చేసుకుని నాణ్యతలో రాజీ పడకుండా లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను పూర్తిచేయాలని ఆదేశించారు.
అనంతరం పవిత్ర రంజాన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మొండివర్రె గ్రామ శాఖ అధ్యక్షులు సాకీర్ పాషా ఇంట్లో నిర్వహించిన రంజాన్ వేడుకలలో పాల్గొన్నారు. అదే గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మద్దిశెట్టి సత్యప్రసాద్, గ్రామ శాఖ అధ్యక్షులు సాకీర్ పాషా, గ్రామశాఖ పాలకవర్గ సభ్యులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
