
స్నేహిశీలి, మృదుస్వభావి, మనందరి వాడు అయినా పేరాబత్తుల రాజశేఖర్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం
Trinethram News : స్నేహశీలి, మృదుస్వభావి, మనందరి వాడు అయినా పేరాబత్తుల రాజశేఖర్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు జిల్లా కోర్టు ప్రాంగణం లోని బార్ అసోసియేషన్ సభ్యులను కలిసి, ఈనెల 27వ తేదీన జరిగే తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటును పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.
ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శాసన మండలి లో కూడా మనకు బలం ఉండాలని, విద్యావేత్త రాజశేఖర్ ను శాసన మండలికి పంపించేందుకు మనమందరం సన్నద్ధం కావాలని, తెలుగుదేశం, జనసేన, బిజెపి, బలపరిచిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు ఓటు వేసేందుకు పట్టభద్రులు సానుకూలంగా ఉన్నారని, గత ప్రభుత్వం న్యాయ వ్యవస్థల్ని కూడా తప్పుదారి పట్టించిందని, న్యాయ వ్యవస్థలో అనేక మార్పులు రావలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు, పరిశీలకులు ఎం.తేజవతి, అనపర్తి వీరభద్రరావు, నర్సింగ్ శ్రీనివాస్, సింగ్ సురేంద్ర, రాచపల్లి ప్రసాద్, కొత్తూరు ఆనంద్, నామ సత్యనారాయణ, కే.హేమంత్ తదితరులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
