
త్రినేత్రం న్యూస్, తోకాడ. రాజానగరం మండలం తోకాడ గ్రామంలో సేద్యపు నీటికుంట (ఫారం పాండ్) మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేశ్ , తూర్తోపు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి తో కలిసి పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ , శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి,
నీటి భద్రతతో భూగర్భ జలాలు పెరిగి భావితరాలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంకుడు గుంతలు కార్యక్రమం రాజానగరం మండలం, తోకాడ గ్రామంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీమతి పి. ప్రశాంతి , రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మరియు, రాజనగరం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుండి ఆయా శాఖల ప్రభుత్వ అధికారులు, వివిధ హోదాలో గల ప్రజా ప్రతినిధులు సమక్షంలో ఘనంగా జరిగింది..
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కి పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన తోకాడ గ్రామ ప్రజలు..
ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
