Trinethram News : సిద్దిపేట జిల్లా :-
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన ప్రమోద్‌రావు, సరిత దంపతుల కుమార్తె సుహానీరావు మిస్ టీన్ గెలాక్సీ పేజెంట్ యూకే టైటిల్ కైవసం చేసుకుంది..
యూకేలోని వారింగ్‌టన్ పార్ హాల్‌లో యునైటెడ్ కింగ్‌డమ్ నలుమూలల నుంచి 25 మంది యువ తులతో కలిసి పోటీపడి అన్ని విభాగాల్లో ప్రతిభ కనబర్చి దక్షిణాసియా మొదటి విజేతగా నిలిచింది.
వచ్చే ఆగస్టులో యూఎస్ ఏలో జరిగే పోటీల్లో యూకే తరఫున ప్రాతినిధ్యం వహించనున్నది…