జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 25 at 6.09.12 PM

TRINETHRAM NEWS

మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న మంత్రి సీతక్క

ములుగు జిల్లా:డిసెంబర్ 25
మేడారం సమ్మక్క సార లమ్మ వన దేవతలను పంచాయితీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ దనసరి అనసూయ సీతక్క సోమవారం దర్శించు కున్నారు.

ముందుగా పసరలోని గుండ్ల వాగు బ్రిడ్జిని, దయ్యాలవాగు సమీపంలో ఉన్న రోడ్డును చింతల్ క్రాస్ వద్ద రోడ్డు, పార్కింగ్ స్థలా లను పరిశీలించారు. అదే విధంగా చిలుకల గుట్ట, వీఐపీ పార్కింగ్ బస్ స్టాండ్‌ ను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చెయ్యా లన్నారు.అధి కారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి జాతర పను లను త్వరగా పూర్తి చేయా లని అధికారులను ఆదేశిం చారు.

ఈ కార్యక్రమంలో ములుగు ఎస్పీ గౌస్ ఆలం, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ, డీఎస్పీ రవీందర్, తదిత రులు పాల్గొన్నారు…..

You cannot copy content of this page