Minister Lokesh’s initiative for disabled students is commendable
Trinethram News : అమరావతి 8/7/2024
ఐఐటీ,ఎన్ఐటిల్లో దివ్యాంగ విద్యార్థులు సీట్లు కోల్పోకుండా ప్రత్యేక జీవో ద్వారా సత్వర చర్యలు చేపట్టిన రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చొరవ ప్రశంసనీయమని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు పేర్కొన్నారు. సోమవారం సురేష్ బాబు మాట్లాడుతూ కేవలం వాట్సాప్ మెసేజ్ ద్వారా దివ్యాంగ విద్యార్థుల సమస్యపై తక్షణమే స్పందించి వారికి ఐఐటి ,ఎన్ఐటీల్లో ప్రవేశాలు కల్పించిన మంత్రి లోకేష్ సహచర మంత్రులకు స్ఫూర్తి దాయకులని అన్నారు.
సామాన్య ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉంటే నేతలపై సమాజంలో గౌరవం మరింత పెరుగుతుందన్నారు. మంత్రి లోకేష్ కృషితో రాష్ట్రంలో సుమారు 25 మంది దివ్యాంగ విద్యార్థులకు జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలు లభించాయని పేర్కొన్నారు.మంగళగిరి నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా మంత్రి లోకేష్ ప్రజా దర్భార్ కార్యక్రమం ద్వారా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ,వాళ్ళ సమస్యలకు పరిష్కారంచూపుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. మంత్రి లోకేష్ స్పూర్తితో రాష్ట్రంలో మంత్రులు,ఎమ్మెల్యేలు, అధికారులు ఇతర ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సురేష్ బాబు విజ్ఞప్తి చేసారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App