
Trinethram News : ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ వివరాలను రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ… నోడల్ ఏజెన్సీగా ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్-APDC వ్యవహరించనున్నట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని D.L.పురం వద్ద క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు.
త్రీ స్టార్, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునకు ఆమోదం తెలిపిందన్నారు. బార్ లైసెన్స్‌ల ఫీజును 25 లక్షల రూపాయలకు కుదిస్తూ ఆమోదం తెలిపిందన్నారు. యువజన, పర్యాటక శాఖ జీవోల ర్యాటిఫికేషన్‌కు ఆమోదం తెలిపిందన్నారు.
AP మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు-2025కి ఆమోదం తెలిపిందన్నారు. జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ‘పల్లె నిద్ర’ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు.
నెలలో నాలుగురోజులపాటు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
