TRINETHRAM NEWS

ఇంటి నెంబర్లు,పట్టాలు ఇవ్వాలి.

Y. యాకయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు రామగుండం అసెంబ్లీ నియోజక ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ సిపిఎం జిల్లా నాయకత్వం క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రాన్ని అందించడం జరిగింది. జిల్లా కార్యదర్శి వై.యాకయ్య మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెండు సంవత్సరాల క్రితం సిపిఎం ఆధ్వర్యంలో భూపోరాటం నిర్వహించగా ఇండ్లు లేని పేదలకు ప్రభుత్వ స్థలాల్లో మల్లు స్వరాజ్యం కాలనీ భగత్ సింగ్ కాలనీ, పి.కె.రామయ్య కాలనీ, జంగాలపల్లి లలో సుమారు ఆరు వందల మంది ఇండ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారని అన్నారు.
వీరికి మంచినీరు, కరెంట్ సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ అన్నారు. వేసవి కాలం ప్రారంభం అయినందున మంచి నీటికీ ఇబ్బందులు కాకుండా మున్సిపల్ టాంకర్ ద్వారా నీటి సరఫరా చేయించాలని కోరారు. అదే విధంగా అక్కడి ప్రజలకు కరెంట్ సౌకరం కల్పించాలని కోరారు. దీంతోపాటు ఇంటి నెంబర్లు, ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరడం జరిగింది దీనికి ఎమ్మెల్యే గారు స్పందించి పేదలు నిర్మించుకున్న ఇండ్లకు కనీస సౌకర్యాలు కల్పిస్తామని, ఇంటి నెంబర్లు,ఇంటి పట్టాలు ఇవ్వడానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
దీంతో ఎమ్మెల్యే ఇచ్చిన హామీకి సిపిఎం జిల్లా బృందం కృతజ్ఞతలు తెలుపడం జరిగింది. ఎమ్మెల్యే కలిసిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై.యాకయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి ఎ.మహేశ్వరి, ఎం.రామాచారి, జిల్లా కమిటీ సభ్యులు నాంసాని శంకర్, మేదరి సారయ్య, ఎన్.బిక్షపతి పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CPM