TRINETHRAM NEWS

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై టోల్గేట్ సమీపంలో రోడ్డుపై పనిచేస్తున్న హైవే సిబ్బందిపై పాల మినీ ట్యాంకర్ దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది. రోజువారీగా కూలి పనిచేస్తూ, రోడ్డుపై హెచ్చరిక బోర్డులు పెట్టి కూలీలు పనిచేస్తుండగా పాలమినీ ట్యాంకర్ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి కర్నూల్ వైపు వెళ్తుండగా జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను వెనువెంటనే కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.