TRINETHRAM NEWS

కానిస్టేబుల్​ మృతి, తృటిలో తప్పించుకున్న మరో పోలీస్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….

Trinethram News : కామారెడ్డి జిల్లా, గాంధారి పట్టణ కేంద్రంలో బుధవారం రాత్రి రవికుమార్, సుభాష్ అనే ఇద్దరు కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్నారు.

ఒక దగ్గర బైక్​ ఆపి ఇద్దరూ నిల్చున్నారు. అటువైపుగా ఒక కారు అతివేగంగా వచ్చింది.

దీన్ని గమనించిన సుభాష్​ గెంతేశాడు. మరో కానిస్టేబుల్​ రవికుమార్​ తప్పించుకునే క్రమంలో కారు బలంగా ఢీకొట్టింది.

రవికుమార్​ అక్కడికక్కడే మృతి చెందగా, సుభాష్​ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

కారు ప్రమాదానికి గురిచేసిన వ్యక్తి గాంధారి పట్టణానికి చెందిన ఒక మెడికల్ షాపు కుమారుడు అని సమాచారం. అతి వేగంగా కారు నడిపించడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. అతివేగంగా వెళ్లవద్దని పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసిన వాహనదారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Midnight road accident