Members of State BC Commission distributing note books to students on the occasion of Subhaprad Patel’s birthday
Trinethram News : వికారాబాద్ :
రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ పుట్టిన రోజు వేడుకలు వికారాబాద్ లో ఘనంగా జరిగాయి. జన్మదిన సందర్భంగా వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. విద్యార్థులు భవిష్యత్తు గురించి వివరించారు. తాత్కాలిక ఆనందాలకు, ఆకర్షణకు గురికాకుండా జీవితాంతం ఉపయోగపడే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కష్టపడాలని తెలిపారు. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా పాత్ర ఎక్కువ ఉందని వీటికి విద్యార్థులు దూరంగా ఉంటూ చదువు
పై దృష్టి సారించి జీవితంలో స్థిరపడే విధంగా మేధాశక్తిని ఉపయోగించాలన్నారు. క్రమశిక్షణతో ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు అని విద్యార్థులకు శుభప్రద్ పటేల్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్, కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ , VDDF చైర్మన్ శ్రీనివాస్, నాయకులు అప్పా విజయ్ కుమార్ కౌన్సిలర్ సురేష్ గౌడ్, నాయకులు కేదార్, ప్రేమ్, శాంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App