Megastar Chiranjeevi and global star Ram Charan, who showed a good heart, donated Rs.1 crore to the victims of Wayanad
Trinethram News : కార్గిల్ వార్ సందర్భంలో కానీ, గుజరాత్ భూకంపం సంభవించినప్పుడు, సునామీ వచ్చి ప్రజలు ఇక్కట్లు పడుతున్నప్పుడు, ఉత్తరాఖండ్ వరదలు, కోనసీమ వరదల సమయంలో కానీ, వైజాగ్‌లో హుదూద్ వచ్చినప్పుడు, కోవిడ్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు.. ఇలా ఒకటేమిటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి అండగా నిలబడుతూ తనదైన స్పందనను తెలియజేసే మొట్టమొదటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి.
ఇప్పుడు కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కేరళ ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ మద్ధతుని తెలియజేసిన సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి వయనాడ్ బాధితుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ‘వయనాడ్ జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో నా గుండె తరుక్కుపోతుంది. బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా సానుభూతిని ప్రకటించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App