TRINETHRAM NEWS

లంబసింగి గర్ల్స్ స్కూల్ లో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశం కార్యక్రమం.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( చింతపల్లిమండలం ) జిల్లా ఇంచార్జ్ : విద్యార్థుల ఉన్నతి కోసం

మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశం.( లంబసింగి గర్ల్స్ స్కూల్ )

ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం ఆదేశాలు మేరకు, డిసెంబర్ ఏడవ తేదిన మెగా పేరెంట్స్ అండ్ టిచర్స్ సమావేశం, రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 45,094 పాఠశాలలో నిర్వహించింది ప్రభుత్వం. జాతీయ విద్యాహక్కు చట్టం, 2009 జాతీయ నూతన విధానం, 2020 పొందిపరిచిన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ మెగా పేరెంట్స్ అండ్ టిచర్స్ సమావేశం నిర్వహించింది.

ప్రత్యకంగా ఎనిమిది పేజిల ప్రోగ్రెస్ రిపోర్టును తయారు చేసింది ప్రభుత్వం.

విద్యార్థుల చదువుతో పాటు నైపుణ్యం,క్రీడలు, ఆరోగ్యంపట్ల చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇది పాఠశాల విద్య వ్యవస్థకే అతి పెద్ద పండగ.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ సమావేశంలో పాల్గోని విజయవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

పాఠశాలల బలోపేతానికి, విద్యార్థులు వికాసానికి, సమస్యల పరిష్కారానికి, దిక్సూచిగా నిలుస్తుంది.

విద్యార్థులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వారధి నిర్మిస్తుంది.

ఈ సమావేశం ద్వారా పిల్లల చదువు, ప్రవర్తన,క్రమశిక్షణ తల్లిదండ్రులు తెలుసుకోవచ్చును.

పిల్లల సమస్యలు, అభ్యసనా సామర్థ్యులు, క్రీడలు, కళలు టీచర్స్ ముందుంచి మరింతగా ఆయా అంశంలో గొప్పగా సాధించేలా టీచర్స్ ప్రోత్సహించవచ్చు. ఈ కార్యక్రమంలో లంబసింగి గర్ల్స్ స్కూల్ కమిటి చైర్మన్ సుర్ల అప్పారావు ముందుగా జ్యోతి ప్రజ్ఞాలన చేసి,విద్యార్థిని లను ఉద్దేశించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ఇప్పటి నుండే చదువుతో, పాటు క్రమశిక్షణ కలిగి,గురువులతో చదువు పరంగా ప్రతీ విషయాన్ని అడిగి తెలుసుకోవాలి. మన గిరిజనుల కోసం ప్రభుత్వ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. దాన్ని మనం వినియోగించుకుని కార్పొరేట్, స్కూళ్లకు ధీటుగా మనం విద్య అభ్యసించాలని ఆయన చెప్పారు. మరియు కార్యక్రమంలో భాగంగా పిల్లలు చేసిన ప్రోగ్రామ్స్,మరియు విన్యాసాలు అందరిని ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ లక్ష్మి, స్కూల్ హెచ్ఎం,వార్డెన్, స్కూల్ సిబ్బంది, పంచాయతీ పెద్దలు రఘు, నూకరాజు సచివాలయం స్టాప్,హెల్త్ డిపార్ట్మెంట్ పిల్లలు తల్లిదండ్రులు అందరు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App