
తేదీ : 23/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముదినేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో యం పి పి రామిశెట్టి. సత్యనారాయణ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈ వేసవిలో మండలం ప్రతి గ్రామాలలో త్రాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
అదేవిధంగా గ్రామాలలో బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగినట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలి. సంబంధిత ఎక్సైజ్ అధికారులకు సూచించారు. ఎంపిడివో రామకృష్ణ, మండల తహసీల్దారు సుభాని పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
