TRINETHRAM NEWS

మత్స్యలింగము మీకు తగుణ

అల్లూరి జిల్లా అరకులోయ,త్రినేత్రం న్యూస్,జనవరి 23.

హామీలు పుల్ అమలు నిల్ అంటూ కుటమి ప్రభుత్వము పై అరకు ఎంఎల్ఏ విమర్శించారు. ముందు ఆ విమర్శకు అర్హత ఉందో లేదొ ఎమ్మెల్యే ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే గిరిజనుల ఓట్ల తొ గెలిచి జగన్ రెడ్డి సేవలో ఉండటానికి మక్కువ చూపుతున్నారు. ఇదే పరిస్థితి ఉంటె మాజీ ఎంఎల్ఏ, ఫాల్గుణకు మడగడ లోజరిగిన ప్రజ తిరుగుబాటు మీకూ కూడా వస్తుంది, ఆని జనసేన నాయకుడూ మురళీ అరకు ఎంఎల్ఏ మత్స్యలింగం ఫై విరుచుకు పడ్డారు. మురళీ మాట్లాడుతు రేగం మత్స్యలింగంకి, నా సూటి ప్రశ్న? ఎమ్మెల్యే మీరు ఈ రోజున 11 కోట్ల రూపాయలతో గుమ్మ పంచాయితీ పరిధిలో జరిగే అభివృద్ధి పనులకు, అధికారులు మమ్మల్ని ఆహ్వానించలేదని?

ఇది సబబు కాదని తీవ్ర స్వరం తో నిలదీశారు.కానీ మీకు అరకు నియోజకవర్గం ప్రజలు నమ్మి ఓటువేసి గెలిపిస్తే మీరు చేసిందేమిటి? చేస్తున్నదేమిటి ? ఇటువంటి శంకుస్థాపనలు చేయడానికి పరిమితం అవుతారా? లేదంటే అసెంబ్లీ కి వెళ్లి గిరిజన ప్రజల గొంతుక అవుతారా ?మీకు గిరిజన ప్రజల అభ్యున్నతి కంటే కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమా ? అసెంబ్లీ కి వెళ్ళను అంటూ భీష్మించుకుని కూచుంటే ఏమి కోల్పోతమో? ఎటువంటి తీర్మానాలు గిరిజన ప్రాంతాలపై ప్రభుత్వాలు చేస్తాయో? వాటిని అమలు చేసేవి ఏమిటో? అమలు చేయకూడనివి ఏమిటో? ఎవరు నిలువరిస్తారు ఎమ్మెల్యే ? ఆ బాధ్యత మీది కాదా? ఆ బాధ్యతలు మీరు లేరా? మీకు మీరుగా మీ అధినేత తో గిరిజన ప్రాంతాల ఎమ్మెల్యేలుగా వున్నా మేము తప్పకుండా అసెంబ్లీ కీ వెళ్ళాలి లేదంటే మా జాతి మమ్మల్ని క్షమించదు.

ఈ విషయాన్ని మీరు గమనించండి, ఇటువంటి స్థితి మనకు మన పార్టీ కి కూడా మంచిది కాదు అని ఎందుకు మీ అధినేతను అడగలేకపోతున్నారు? ఇటువంటి పరిస్థితులపై మీరు జవాబు దారితనంగా లేకుండా, మీరు మాకు ఆహ్వానించకుండా శంకుస్థాపనలు చేశారు అంటూ రాద్ధాంతం నానా యాగీ చేయడం అధికారులపై విరుచుకుపడటం, చూస్తుంటే మీ రాజనీతి ఏపాటిదో సామాన్యులకు సులభంగానే అర్థమవుతుంది. మన్నించాలి ఎమ్మెల్యే,ఒక మాట మన గిరిజన ప్రజలపై తల్లి,తండ్రి పాత్ర పోషించే మీరు,మమ్మల్ని గాలికొదిలేసి పక్కదార్లు పట్టిన స్త్రీ వలె వుంది, మీ పరిస్తితి.మీరు మీ విధి నిర్వహణలో శిత్తశుద్దితో వుంటే మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించారు? అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యేలపై సామాన్యులకు కూడా గౌరవం లేదు,ఇది వాస్తవం.ఇప్పటికైనా పోయిందేమి లేదు దయ చేసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు,అంటూ గిరిజన ప్రజల ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తప్పుదోవ పట్టించడం పక్కన పెట్టీ, ప్రజలకు మంచి చేసే దిశగా ఆలోచన చేయడం మంచిది.ఇలా అనవసర వాక్యాలు చేయడం మంచిది కాదు.

గిరిజన ప్రాంత చరిత్రలో ఎన్నడూ చూడలేదు ఇటువంటి పరిస్థితులు విద్యావంతులైన మీరు నాయకులుగా ఉన్న కూడా గిరిజన ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు గా ఉండి కూడా అసమర్థ పరిస్థితులు ఏర్పడటం గిరిజన జాతికి ఏ సందేశం ఇవ్వలనుకుంటున్నారు? కనీసం మీ నాయకత్వ సమర్ధత ఇది అని చెప్పుకునేందుకు,కనీస ప్రయత్నం ఏమైనా చేశారా? ఒక వైపు పాడేరు ఎమ్మెల్యే,మండల సర్వ సభ సభ్యులు సమావేశానికి అధికారులు హాజరు కాకపోవడం తీవ్రంగా హెచ్చరించారు. అదే హెచ్చరిక ప్రజలు మీకు చేస్తున్నారు మీరు దయ చేసి అసెంబ్లీకి వెళ్లి నిర్భయంగా పోరాడండి మన ప్రాంతానికి కావలిసిన,రావలసిన నిధులు అభివృద్ధి కార్యక్రమాలు సాధించి తీసుకురండి. ఎంతా సేపు నియోజక వర్గం వారీగా మండల కేంద్రాల్లో తిరిగితే అక్కడ మీ బాధ్యత ఎవరు నిర్వర్తిస్తారు ?మీకు గిరిజన ప్రజల బాధ్యత గొప్పా?లేక జగన్మోహన్ రెడ్డి,ఆదేశాలు గొప్పా?తేల్చి చెప్పండి లేదు మా వల్ల కాదంటే రాజీ నామా చెయ్యండి? గిరిజన ప్రజల ఆశలు నీరుగార్చేశారు?ఇది చాలక వాళ్ళని మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుదోవ పట్టిస్తున్నారు, ఇది హుందాతనం రాజకీయాలు కాదు. అరకు,పాడేరు నియోజక వర్గాల,గిరిజన ప్రజలారా మీరు చైతన్యం కావాలి, ఇటువంటి పనిదొంగల పని పట్టాలి మన నాయకులు ఎందుకు గెలిచారు?

,ఎందుకు అసెంబ్లీకి వెళ్ళరు? ఎందుకు ఇటువంటి ఊక దంపుడు హెచ్చరికలు చేస్తున్నారు?ప్రతి ఒక్కరూ నిలదీయండి.మా గిరిజన ప్రాంతాల ప్రథమ పౌరుల బాధ్యతలు ఇస్తే మీరు చేసేది ఇదేనా? మీ వల్ల ఏమి కాదని కూటమి నాయకుల ద్వారా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అధికారులు చేపించారు, అదే మీరు సమర్థవంతంగా పనులు చేస్తూ అసెంబ్లీకి వెళ్తూ మన ప్రాంతాల గొంతుక అయితే కచ్చితంగా మీకు ఆహ్వానం అంది ఉండేది.ఇంతా చిన్న లాజిక్ మీరు ఎలా మిస్సయ్యారు? ఎవరిని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు? ఈ ప్రశ్నలన్నీ కూడా గిరిజన ప్రజల పక్షాన మేము అడుగుతున్నాం మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే ?చెప్పలేకుంటే మేము అసమర్థ నాయకులమని ఒప్పుకోవాల్సిందే? అలాగే కూటమి నాయకులకు మా విన్నపం ఇకపై మీరు అరకు,పాడేరు జంట నియోజక వర్గాల శాసన సభ సభ్యుల పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఆ బాధ్యత మోయాల్సి ఉంటుంది.ఈ అంశాలన్నీ మేము రాజకీయ ఆలోచనతో ప్రస్తావించలేదు,సగటు గిరిజన జాతి వ్యక్తిగా మా నాయకుడు,ఎలా ఉండాలనే అంశంపై నిశ్చితాభిప్రాయం తో చెప్తున్నాం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App