TRINETHRAM NEWS

Massive transfers and postings of IAS officers in AP

Trinethram News : ఏపీలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్ లు చేపట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం తప్పడంలేదు. ఇటీవలే పెద్ద ఎత్తున ఐపీఎస్ లను బదిలీ చేశారు. పలు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. తాజాగా, ఐఏఎస్ లను బదిలీ చేశారు. పలు కీలక శాఖలకు కమిషనర్లను, ఎండీలను, డైరెక్టర్లను, సీఈవోలను, సీఎండీలను, జాయింట్ కలెక్టర్లను నియమించారు.

కాగా, పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ యువ ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజ నియమితులయ్యారు. ఆయన ఇటీవల కేరళ నుంచి డిప్యుటేషన్ పై ఏపీకి వచ్చారు. కృష్ణతేజ… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఓఎస్డీగా నియమితులవుతారంటూ ప్రచారం జరిగింది. అయితే, పవన్ నిర్వహిస్తున్న శాఖలకే డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.

పోస్టుపేరు,అధికారుల పేర్లు….

నూరుల్ కమర్- ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి

సీహెచ్ శ్రీధర్- మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్

ఎం హరినారాయణ- మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్

చేవూరి హరికిరణ్- ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్

వీరపాండ్యన్- సెర్ప్ సీఈవో

మల్లికార్జున- బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్

ప్రసన్న వెంకటేశ్- సాంఘిక, సంక్షేమ శాఖ కార్యదర్శి

శ్రీకేష్ బాలాజీరావు- భూ సర్వే, సెటిల్మెంట్ల డైరెక్టర్

గిరీశ్ షా- పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ

మంజీర్ జిలానీ- ఏపీ మార్క్ ఫెడ్ ఎండీ, శాప్ ఎండీగా అదనపు బాధ్యత

కృతికా శుక్లా- ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్

రవి సుభాష్- ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ

లక్ష్మీ షా- ఏపీ ఎంఎస్ఐడీసీ

ఎండీ, ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోగా అదనపు బాధ్యతలు

ఎం వేణుగోపాల్ రెడ్డి- మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్

నిశాంత్ కుమార్- ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డైరెక్టర్

జీసీ కిశోర్ కుమార్- క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్ మిషన్ ఎండీ

విజయ సునీత- వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్

లావణ్య వేణి- సాంఘిక, సంక్షేమ శాఖ డైరెక్టర్

అభిషిక్త్ కిశోర్- ఏపీఐఐసీ ఎండీ, ఏపీటీడీసీ ఎండీగా అదనపు బాధ్యతలు

రామసుందర్ రెడ్డి- ఆర్ అండ్ ఆర్ కమిషనర్

కీర్తి చేకూరి- ట్రాన్స్ కో జాయింట్ ఎండీ

గణేశ్ కుమార్- స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ

సంపత్ కుమార్- విశాఖ మున్సిపల్ కమిషనర్

దినేశ్ కుమార్- గుంటూరు మున్సిపల్ కమిషనర్

ధ్యానచంద్ర- విజయవాడ మున్సిపల్ కమిషనర్

నారపురెడ్డి మౌర్య- తిరుపతి మున్సిపల్ కమిషనర్

ఎన్ తేజ్ భరత్- కడప మున్సిపల్ కమిషనర్

కేతన్ గార్గ్- రాజమండ్రి మున్సిపల్ కమిషనర్

భావన- కాకినాడ మున్సిపల్ కమిషనర్

మల్లవరపు సూర్యతేజ- నెల్లూరు మున్సిపల్ కమిషనర్

హిమాన్షు కౌశిక్- తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్

గోవిందరావు- కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్

నిశాంతి- కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్

అభిషేక్ గౌడ- అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్

ఎం కృష్ణతేజ- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్

ప్రవీణ్ చంద్- సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్

నవీన్- సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్

నిధి మీనా- ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్

సి విష్ణు చరణ్- నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్

శుభమ్ భన్సల్- తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్

ఫర్మాన్ అహ్మద్ ఖాన్- శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్

అదితి సింగ్- కడప జిల్లా జాయింట్ కలెక్టర్

పి ధాత్రి రెడ్డి- ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్

ఆదర్శ్ రాజేంద్రన్- అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్

అమిలినేని భార్గవతేజ- గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్

సూరజ్ ధనంజయ్- పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్

ఎంవీ శేషగిరి- స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్

రేఖారాణి- హ్యాండ్ లూమ్స్, టెక్స్ టైల్స్ శాఖ కమిషనర్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Massive transfers and postings of IAS officers in AP...