TRINETHRAM NEWS

కంసన్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..

ఫైర్ ఇంజన్ల తో మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

– సుమారు రూ.30 కోట్ల రూపాయల ఆస్తి నష్టం

Trinethram News : తెలంగాణ – కొత్తూరు
కంసన్ హైజెన్ కేర్ పరిశ్రమలోని డైపర్ తయారీ ప్లాంట్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి కాలి బూడిదయింది.

ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో మంగళవారం అర్థ రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నందిగామ సమీపంలో గల కంసన్ హైజెన్ కేర్ పరిశ్రమలోని డైపర్ తయారీ ప్లాంట్ లో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగి షెడ్డు మొత్తం మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో పరిశ్రమలో సుమారు 50 మంది కార్మికులు పని చేస్తున్నారు. కార్మికులకు ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టంగాని, గాయాలు గాని కాలేదని నిర్వాహకులు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు షాద్ నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్ ఫైర్ స్టేషన్ల నుండి ఫైర్ ఇంజన్లను రప్పించారు. ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అప్పటికే పరిశ్రమ మొత్తం కాలి షెడ్డు కూలిపోయింది. షెడ్డులోని సుమారు రూ.30 కోట్ల విలువ చేసే మిషనరీ, మెటీరియల్ పూర్తిగా కాలిపోయాయి. పరిశ్రమ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నందిగామ పోలీసులు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App