TRINETHRAM NEWS

వరుడి సిబిల్ స్కోర్ సరిగ్గా లేదని వివాహం రద్దు

Trinethram News : మహారాష్ట్ర : మహారాష్ట్రలోని ముర్తిజాపూర్కు చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యవకుడితో పెద్దలు పెళ్లి సంబంధం కుదిర్చారు. వివాహానికి కావాల్సిన అని విషయాలు మాట్లాడుకొని తేదీ సైతం ఖరారు చేశారు.

అయితే వివాహానికి కొన్ని రోజుల ముందు వధువు మేనమామ వరుడి సిబిల్ స్కోర్ను చెక్ చేయగా అతడు అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా సిబిల్ స్కోర్ కూడా తక్కువ ఉండడంతో వారు ఈ పెళ్లికి నిరాకరించారు.

క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ (CIBIL) అందించే క్రెడిట్ స్కోరునే సిబిల్ స్కోరు అంటారు. వ్యక్తుల ఆర్థిక పరిస్థితిని, రుణాలను అంటే గృహ రుణం, వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డు వంటి వాటిని ఎలా నిర్వహిస్తున్నారో డేటాను సేకరించి, క్రెడిట్ స్కోరును లెక్కిస్తుంది.

బ్యాంకులు రుణాలు ఇచ్చే ముందు ఈ క్రెడిట్ స్కోరును పరిశీలించి మంచి స్కోరు ఉన్నవారికి త్వరితగతిన రుణాలు మంజూరు చేస్తాయి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CIBIL score