ధారూర్ రైల్వే స్టేషన్ లో పలు రైళ్లను నిలుపాలి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
భారత ప్రభుత్వ విప్, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సిఫార్సు మేరకు, సౌత్ సెంట్రల్ రైల్వే GM అరుణ్ కుమార్ జైన్ జీ కి మరియు DGM కోట్ల ఉదయ్ నాథ్ కి వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు.ధారూర్ రైల్వే స్టేషన్ లో తాండూర్ ప్యాసింజర్, బీజాపూర్ ఎక్స్ప్రెస్, హుబ్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలపాలని, ధారూర్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలుగా ఉంటుందని కోరారు, వారి వినతికి రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు కోకట్ మాధవ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్, నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్, జిల్లా దిశా కమిటీ మెంబర్ వడ్ల నందు, ధారూర్ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు రాజు నాయక్,జిల్లా ఉపాధ్యక్షులు వివేకానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App