
రానున్న రోజులలో బాక్సాఫీస్‌ని షేక్ చేసేందుకు పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పాన్ ఇండియా చిత్రాలుగా అవి రూపొందుతుండగా వాటిలో ప్రభాస్ నటిస్తున్న కల్కి ఒకటి. ఈ సినిమా గత కొద్ది రోజులుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా షూటింగ్ జరుపుకుంటుంది. కల్కి 2898 ఏడీ చిత్రాన్ని టాలీవుడ్‌లోని బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన వైజయంతీ మూవీస్ బ్యానర్ పై రూపొందుతుండగా, సి. అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కల్కి 2898 ఏడీ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటి దీపికా పదుకొణెతోపాటు సెక్సీ భామ దిశా పటానీ హీరోయిన్స్‌గా నటిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని సుమారు రూ. 500 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా, ఇందులో లోకనాయకుడు కమల్ హాసన్ విలన్‌గా చేస్తున్నారు. అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. చిత్రానికి సంబంధించి అనేక వార్తలు నెట్టింట హల్చ…
