TRINETHRAM NEWS

మందమర్రి మార్కెట్లో బడ వ్యాపారుల ఆక్రమణలకు అడ్డేది

బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్

మందమరి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మందమర్రి మార్కెట్లో బడ వ్యాపారులు హవా కొనసాగుతుంది చిన్నచిన్న షాపులు పెట్టుకుని వ్యాపారం చేద్దామనుకునే వారికి అవకాశం లేకుండా పోయింది మున్సిపల్ అధికారులు నాళాలు ఖాళీ స్థలాలు మార్కెట్ లో కబ్జా అయితున్నప్పటికీ చూసి చూడనట్టు పోతున్నారని, బడ వ్యాపారస్తుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తు, చిన్న చిన్న వ్యాపారులపై తమ ప్రతాపాన్ని చూపుతున్నారని బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్ అన్నారు మందమర్రి టౌన్ ప్లానింగ్ అధికారులు మార్కెట్ వెనకాల గల పేదల ఇళ్లను తొలగించి కొండయ్య సూపర్ మార్కెట్ నుండి అజయ్ క్లాత్ స్టోర్ వరకు కాలువలు కబ్జాకు గురైన మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు బడ వ్యాపారులకు రెవిన్యూ మున్సిపల్ అధికారులు చుట్టాల అని ప్రశ్నించారు ముల్కల రాజేంద్రప్రసాద్ కబ్జాకు గురైన కాలువలు, ఆక్రమణకు గురికావడానికి సిద్ధంగా ఉన్న కాళీస్తాలాలను పరిరక్షించాల్సిన బాధ్యత రెవిన్యూ మున్సిపల్ అధికారులదే.


కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ముల్కల్ల రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు
వెంటనే వారిపై చర్యలు తీసుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App