
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం కమలాపురం గ్రామంలో గల ఆశ్రమ ఉన్నత పాఠశాల నందు 23/03/2025 నాడు షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి గదిలో ఉన్న పరుపులు క్రీడా సామాగ్రి కాలిపోవడం మరియు ఆ మంటల వేడికి గది మొత్తం కూడా డ్యామేజ్ జరిగినది. ఆ డ్యామేజ్ యొక్క మొత్తం విలువ సుమారు లక్ష రూపాయల వరకు వుండవచ్చు ఈ విషయం తెలుసుకున్న ములకలపల్లి జనసేన పార్టీ నాయకులు ఆ వసతి గృహాన్ని సందర్శించి అక్కడున్నటువంటి వార్డెన్ నాగ ప్రత్యూష నీ ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకొని ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయ అని పార్టీ నాయకులు అడగగా కొన్ని సమస్యలు తెలియపరిచారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ మాట్లాడుతూ ఈ ఆశ్రమ ఉన్నత పాఠశాల వసతి గృహం నందు 220 మంది ఉన్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అగ్ని మాపక భద్రత పరికరాలు వసతి గృహం నందు మరియు అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లల వసతి గృహాలకు అగ్నిమాపక భద్రతా పరికరాలు ఏర్పాటు చేయాలని మరియు కమలాపురంలో ఉన్న పిల్లల వసతి గృహం పక్కనే సీతారామ ప్రాజెక్టు కాలువ నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది వసతి గృహానికి ఉన్నటువంటి ప్రహరీ ఎత్తు తక్కువగా ఉండటం వల్ల పిల్లలు ప్రహరీ గోడ దాటి వెళ్లి ఆ కాలంలో పడే ప్రమాదం ఉంది కావున ప్రహరీ గోడ నిర్మాణం ఎత్తి పెంచాలని జనసేన పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు ప్రజా ప్రతినిధులను డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు పొడిచేటి చెన్నారావు ప్రధాన కార్యదర్శి గొల్ల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
