ఆసుపత్రిలో చేరిన మంచు మోహన్ బాబు
Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 11
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి 9:30 గంటల సమయంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రి లో చేరారు. ప్రస్తుతం మోహన్ బాబుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు ఆసుపత్రికి వచ్చారు. ఇదిలా ఉండగా.. మోహన్ బాబుపై జర్నలిస్టు సంఘాలుఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే మీడియాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
అంతేకాదు.. మోహన్ బాబు ఇంటి ఎదుట బైటాయించి ఆందోళనలు చేస్తున్నారు. మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ ఘటనపై తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తీవ్రస్థాయిలో ఖండించింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App