TRINETHRAM NEWS

జనసేన పార్టీలోకి మంచు మనోజ్ దంపతులు

Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 16
మంచు కుటుంబంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా బలపడాలని భావిస్తున్నారని సమా చారం.. ఇందుకోసం
మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక, రాజకీయ రంగప్ర వేశానికి సర్వం సిద్ధమైంది. మనోజ్, మౌనిక దంపతులు జనసేన పార్టీలో చేరనున్నారు.

సోమవారం ఆళ్లగడ్డ లో మౌనిక తల్లి, మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వెయ్యి కార్లతో భారీ ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు.

భూమా ఘాట్ లో రాజకీయ ఆరంగేట్రంపై దంపతులు ప్రకటించను న్నారు. మంచు మనోజ్ కు ఆయన తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణుతో విభేదాలు పొడచూపాయి.

దీంతో మనోజ్ ను ఇంట్లో నుంచి బయటకు పంపారు. మౌనిక అక్క టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మనోజ్, మౌనిక జనసేనలో చేరుతుండటం ఏపీ రాజకీ యాల్లో చర్చనీయాంశంగా మారింది.

నంద్యాల నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగే యోచనలో మౌనిక ఉన్నట్టు తెలుస్తుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App