
మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ రోజు జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించి మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ సిసిసి నస్పూర్ సింగరేణి కాలరీస్ హై స్కూల్ లోని పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పరీక్షా ప్రక్రియను పరిశీలించారు. పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ కూడా లోపాలు ఉండకుండా పర్యవేక్షణ చేయాలని అన్నారు.
అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బన్స్ యాక్ట్ -2023 అమలులో ఉంటుందని, అన్ని పరీక్ష కేంద్రాలవద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మంచిర్యాల జోన్ పోలీస్ శాఖ పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని, ఎవ్వరూ కూడా అవకతవకలకు పాల్పడవద్దని ప్రతీ ఒక్కరు కష్టపడి చదివి టైమ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ పరీక్షలు రాయాలని కోరారు విద్యార్థులు నిర్నిత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు రావాలని అన్నారు
ఈ సందర్బంగా మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ మరియు బందోబస్తు సిబ్బంది ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
