Manali Thakur met Singareni contract workers on the orders of MLA Raj Thakur
సింగరేణి కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు 5000 రూపాలు దసరా బోనస్ ప్రకటించడం తో కాంట్రాక్టు కార్మికుల ఆనందానికి అవధులు లేవని మనాలి ఠాకూర్ అన్నారు.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
అందులో భాగంగా విట్టల్ నగర్ లోని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులని కలవడం జరిగింది.
అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంట్రాక్టు కార్మికుల కూడా బోనస్ ప్రకటించడం చాలా సంతోషకరమని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే గరీబోళ్ల ప్రభుత్వం అని అన్నారు
ఇంకా ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పని చేస్తుందని,ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు పనిచేసే ప్రభుత్వమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్ మరియు కాంట్రాక్ట్ కార్మికులు నాయకులు తదితరులు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.