బేటి బచావో బేటి పడావో కార్యక్రమం నిర్వహణ.
బేటి బచావో బేటి పడావో కార్యక్రమం నిర్వహణ.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
డిండి మండల పరిధిలోని చెరుకుపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవరకొండ ఐసిడి ఎస్ డిండి సెక్టార్ సూపర్వైజర్ రేణుక రెడ్డి హాజరై ప్రసంగించారు.
బాల్య వివాహాలు చేసుకుంటే కలిగే నష్టాల గురించి వివరించడం జరిగింది. ఆడపిల్లలంతా చదువుకోవాలని ఈ సందర్భంగా ఆమె వివరించారు. ఆడపిల్లల చదువు ప్రాముఖ్యత గురించి ఆమె బాలికలకు వివరించారు.
ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు ప్రభుత్వం ఉచిత విద్యా హాస్టల్ వసతులను కల్పిస్తుంది . ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఆడపిల్ల ఉపయోగించుకొని వృద్ధిలోకి రావాలని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపియా నాయక్, మహిళా ఉపాధ్యాయులు సుజాత, లక్ష్మీ వాసవి, హజ్ హత్తు సుల్తానా, కిషోర్ , బాలికలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App