TRINETHRAM NEWS

ఏఐటియుసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆర్జీ వన్ అధ్యక్షులు ఎం.ఎ.గౌస్ వెల్లడి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రజలది

సింగరేణి వ్యాప్తంగా నర్సరీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాల అమలు కోసం సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసిందని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఆర్జీ వన్ అధ్యక్షులు ఎం.ఎ.గౌస్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 2022 లో చేసిన 18 రోజుల సమ్మె సందర్భంగా యూనియన్ లు యాజమాన్యం తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా అట్టి ఒప్పందం లోని డిమాండ్ లను అమలు చేయాలని గుర్తింపు సంఘం ఏఐటియుసి కోరిన మేరకు యాజమాన్యం నర్సరీ లలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు చట్ట బద్ధమైన హక్కులను అమలు చేసేందుకు తగు ఆదేశాలు జారీ చేసిందని ఆయన వెల్లడించారు.

గుర్తింపు సంఘం ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు కృషి ఫలితంగా సింగరేణి వ్యాప్తంగా నర్సరీ కార్మికులకు మార్చి 1వ తేదీ నుండి కనీస వేతనాల అమలు,సీఎం పిఎఫ్, బోనస్సు,బ్యాంకు జీతాలు తదితర హక్కుల ను అమలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. కనుక నర్సరీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఏఐటియుసి కృషి ని గమనించగలరని ఆయన ఒక ప్రకటన లో పేర్కొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AITUC