TRINETHRAM NEWS

Trinethram News : 13-01-2024 వ తేది రాత్రి క్రింది కనబరిచిన ముద్దాయిలు బంగారుపాళ్యం మండలం, కే.ఎం.కండ్రిగ, ఎగువ కనతల చెరువు పంచాయతీ, నాగలాపురం గ్రామం దగ్గరలో గల తూర్పు అడవిలోనికి కే.ఎం.కండ్రిగ, ఎగువ కనతల మరియు నాగలాపురం గ్రామానికి చెందిన నాగరాజు, వెంకటేశులు, పాండ్యా అను ముగ్గురు వేటకు వెళుతూ నాటు తుపాకులు తీసుకుని శేఖర్ అను వ్యక్తిని వారితో పాటు పిలుచుకొని అడవిలోని వేటకు వెళ్లి ఉండి, నాగలాపురం తూర్పు అడవిలో జంతువుల కొరకు వెతుకుతూ, వారికి ఎద్దు అరుపులు వినిపించగా, ఇందులో A3 ముద్దాయి అయిన వెంకటేశులు, మరణించిన ఉమాపతికి ఫోన్ చేసి మీ ఎద్దు అరుపులు తూర్పు అడవిలో వినపడుతున్నది అని తెలుపగా. అంతట ఉమాపతి తన అన్న శరత్ ను పిలుచుకునే నాగలాపురం తూర్పు అడవిలోనికి వెళ్లగా, సదరు ముద్దాయిలు మరియు ఉమాపతి అన్న ఎద్దు కోసం వెతుకగా అది కనపడకపోవడంతో. మరణించిన ఉమాపతి అన్న తన తమ్ముడిని ఇంటికి రమ్మని పిలువుగా నీవు ముందు వెళ్ళు నేను వస్తాను అని చెప్పడముతో, అంతట శరత్ అక్కడ నుండి బయలుదేరి నాగలాపురం గ్రామము వద్ద ఉన్న బండపై ఉండగా, కొద్దిసేపటికి నాటు తుపాకి శబ్దం వినిపించినది, తరువాత కొద్దిసేపటికి ఉమాపతిని పై కనిన నలుగురు వ్యక్తులు మోసుకుని తీసుకొని రావడముతో, శరత్ ఏమి జరిగినది అని ఉమాపతిని అడుగగా ఉమాపతి ఎద్దుకోసం వెతుకుతున్న నన్ను చీకటిలో అడవి జంతువు అని భావించి నాగరాజు నాపై కాల్పులు జరిపినాడని చెప్పి కోన ఊపిరితో ఉన్న ఉమాపతి మరణించడముతో, వెంటనే ముద్దాయిలు వారి వారి తుపాకులు తీసుకుని అక్కడి నుండి పారిపోయినారని, మరణించిన ఉమాపతి అన్న శరత్ పోలీసులకు సమాచారం తెలియజేయగా పై తలిపిన నలుగురిపై కేసు నమోదు పరచడమైనది. తరువాత ఈ దినం అనగా 15-01-2024 వ తేదీ కేసు దర్యాప్తులో భాగంగా మాకు రాబడిన సమాచారం మేరకు నాగలాపురం క్రాస్ వద్ద ముద్దాయిలు ఊరు నుండి వెళ్ళిపోతున్నారని తెలియరావడముతో, సదరు సమాచారం మేరకు నేను నా సిబ్బందితో కలిసి వెళ్లి పైకానిన ముద్దాయిలను బంగారుపాళ్యం మండలం, కే.ఎం.కండ్రిగ @ ఎగువ కనతల చెరువు పంచాయతీ, నాగలాపురం గ్రామం క్రాస్ వద్ద అరెస్టు చేసి, వారి వాంగ్మూలం మేరకు మూడు నాటు తుపాకులను నా స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి కోర్టుకు పంపడమైనది.

మరణించిన వ్యక్తి వివరములు :
పి.ఉమాపతి, వయస్సు 22 సంవత్సరాలు, S/o P.బాబు, కులం: పల్లె గౌండర్, K.M.కండ్రిగ ఎగువకనతల చెరువు గ్రామం మరియు పంచాయతీ, బంగారుపాళ్యం మండలం.

ముద్దాయిల వివరములు:
A1. పి.నాగరాజు, వయస్సు 47 సంవత్సరాలు, S/o P.ఓబులు, నాగలాపురం గ్రామం, H/o K.M.కండ్రిగ ఎగువకణతల చెరువు, బంగారుపాలెం మండలం.
A2. V. వెంకటేసులు, వయస్సు 53 సంవత్సరాలు, S/o లేట్ వీరాస్వామి, K.M.కండ్రిగ ఎగువకనాథల చెరువు గ్రామం మరియు పంచాయతీ, బంగారుపాలెం మండలం
A3. T.పాండ్య @ పాండియన్, వయస్సు 40 సంవత్సరాలు, S/o చిన్నబ్బ, K.M.కండ్రిగ ఎగువకనాథల చెరువు గ్రామం మరియు పంచాయతీ, బంగారుపాలెం మండలం.
A4. P.శేఖర్, వయస్సు 47 సంవత్సరాలు, S/o పెరియప్ప, K.M.కండ్రిగ ఎగువకనాథల చెరువు గ్రామం మరియు పంచాయతీ, బంగారుపాలెం మండలం.