TRINETHRAM NEWS

తల్లి దండ్రులపై దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి అరదండాలు విధించారు.

నిందితుడి అరెస్టుకు సంబంధించి మదనపల్లి డి.ఎస్.పి ప్రసాద్ రెడ్డి కథనం మేరకు…

మదనపల్లి నీరు గట్టువారిపల్లెలోని అయోధ్య నగర్లో కాపురం ఉంటున్న వృద్ధ దంపతులు వెంకటరమణారెడ్డి లక్ష్మమ్మలు బి. కొత్తకోట మండలం, బయప్ప గారి పల్లి పంచాయతి, గుంతవారిపల్లి నుంచి బ్రతుకు దెరవు కోసం వచ్చి మదనపల్లి నీరుగట్టువారిపల్లి అయోధ్య నగర్ లో కాపురం ఉంటున్నా రన్నారు.

వీరికి నలుగురు సంతానం కాగా రెండవ కొడుకు శ్రీనివాసులు రెడ్డి ఆస్తి పంపకాల విషయమై గత కొంత కాలంగా తల్లి దండ్రులతో గొడవ పడుతున్నాడన్నారు.

ఈ క్రమంలో శనివారం అయోధ్య నగర్ లో ఉంటున్న తల్లిదండ్రులు వెంకటరమణ లక్ష్మమ్మలను ఆస్తిలో వాటాలు పంచాలని నిలదీసి, మాట మాట పెరిగి తనకు ఆస్తిలో వాటాలు పంచడంలో వివక్ష చూపించారని శ్రీనివాసులు విచక్షణ కోల్పోయి దాడి చేసి చితకబాదాడన్నారు.

వయోవృద్ధులైన తల్లి తండ్రి అని కూడా చూడ కుండా కాళ్లతో ఎదపై తన్నుతూ, జుట్టు పట్టి లాగి చేతులతో కొట్టడంతో ఆ వృద్ధ దంపతులు తీవ్రంగా గాయపడి నట్లు తెలిపారు.

ఘటనపై టూ టౌన్ పోలీసులు రంగ ప్రవేశం చేసి విచారణ అనంతరం నిందితుని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం శ్రీనివాసులు రెడ్డి పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు అనంతరం అరెస్టు చేశామని తెలిపారు.