
హుదా సొసైటీ సేవలు అభినందనీయం: మల్లెల రాజేష్ నాయుడు
పేదల అభ్యున్నతి కోసం హుదా సొసైటీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు పేర్కొన్నారు. పట్టణంలోని హుదా సొసైటీ ఆధ్వర్యంలో శనివారం సౌదీ అరేబియా నుండి వచ్చిన ఖర్జూరాల దిగుమతి జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్లెల రాజేష్ నాయుడు హోదా సొసైటీ సేవలను అభినందించారు. YSRCP పట్టణ అధ్యక్షులు తలహాఖాన్
మాట్లాడుతు వీటిని రాష్ట్ర మంతటా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. తొలుత అనస్ ఖాన్ ప్రార్ధన చేశారు. ఈ కార్యక్రమంలోబేరింగ్ మౌలాలి, గుంజి వీరాంజనేయులు, షేక్ నాగూర్, ఇక్బాల్ పలువురు సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
