TRINETHRAM NEWS

స్వర్గీయ మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యం రెడ్డి విగ్రహన్ని ఆవిష్కరించిన మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు

త్రినేత్రం న్యూస్ ఉమ్మడి మెదక్ జిల్లా బ్యూరో

తొగుట మండలం బండారుపల్లి మెట్టు గ్రామంలో మాజీ మంత్రివర్యులు స్వర్గీయ చెరుకు ముత్యంరెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమము మరియు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.విగ్రహనికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు చెరుకు ముత్యం రెడ్డి అని అన్నారు. ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు……
వారితోపాటు మన ప్రియతమ నాయకులు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి పాల్గొనడం జరిగింది…

ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం లోని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, వివిధ మండల పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మాజీ ఏఎంసీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, తాజా మాజీ సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ, సోషల్ మీడియా కోఆర్డినేటర్, ఎస్సీ సెల్, బీసీ సెల్ నాయకులు, మహిళా నాయకురల్లు, ప్రజా ప్రతినిధులు చెరుకు కుటుంబ అభిమానులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App