
తేదీ : 22/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పాలకొల్లు లో ఉన్నటువంటి పంచరామ క్షేత్రమైన క్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు మహాశివరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ముచ్చర్ల. శ్రీనివాసరావు చెప్పడం జరిగింది.
మహాశివరాత్రి సందర్భంగా 26వ తేదీ బుధవారము తెల్లవారుజామున నాలుగు గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామివారి దర్శనం ఉంటుందని తెలిపారు. సాయంత్రం 8 గంటల 35 నిమిషాలకు జగ జ్యోతి, మరియు లింగోద్భవ కాలంలో పాగా అలంకరణ ఉంటుందని తెలపడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
