TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రంన్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ ఆటో కాలనికి చెందిన మరపెల్లి సాంబయ్య ఆటో డ్రైవర్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటుండగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో తోటి ఆటో డ్రైవర్లు సాంబయ్య యొక్క పరిస్థితి ని వీడియో తీసి పోస్ట్ చేయగా ఆ పోస్టు ను చూసి స్పందించిన సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ సోమవారం రోజున బియ్యం నిత్యవసర సరుకులు అందజేసినట్లు తెలిపారు అనంతరం మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ సాంబయ్య గత 20 ఏళ్ల నుంచి తిలక్ నగర్ డౌన్ ఆటో అడ్డాలో ఆటో నడుపుతూ గోదావరిఖని లో ఉండే వారని ఐదు సంవత్సరాల క్రితం రెండో డివిజన్ ఆటో కాలనీలో భార్య పిల్లలతో నివాసం ఉంటున్నారని సాంబయ్య అనారోగ్యం గురై ఇంటికి పరిమితం కావడంతో ఇంట్లో తినడానికి కూడా ఇబ్బంది ఉందని తోటి డైవర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నేను ఆ వీడియో చూడడం జరిగిందని సాంబయ్య పరిస్థితిని చూసి చలించిపోయనని ఈరోజు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులందరి సహకారంతో సాంబయ్య కుటుంబానికి 25 కిలో బియ్యంతో పాటు నిత్యాసర సరుకులు అందజేశామని మల్లేష్ తెలిపారు
ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సహకారం అందించిన ఫౌండేషన్ సభ్యులందరికీ పేరుపేరునా బాధిత కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అధ్యక్షుడు మడిపెల్లి మల్లేష్ అన్నారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు,పర్వతాలు మల్లయ్య, రెండోవ డివిజన్,కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి గుర్రాల మల్లేష్ యాదవ్,వినయ్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mallesh, president of Sevaspirathi Foundation